

దిగ్గజ నటి మీనా కుమారి జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా కంటే హక్కుల వివాదమే ప్రధాన చర్చగా మారింది. మీనా కుమారి జీవితకథకు సంబంధించిన పూర్తి సినీ హక్కులు తమకే ఉన్నాయని అల్మైటీ మోషన్ పిక్చర్స్ ప్రకటించింది. అనుమతి లేకుండా ఆమె జీవితాన్ని సినిమా, వెబ్ సిరీస్, టెలివిజన్ కార్యక్రమం లేదా డాక్యుమెంటరీగా రూపొందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ హక్కులకు సంబంధించి ఇప్పటికే పబ్లిక్ నోటీసులు కూడా జారీ చేసినట్లు సంస్థ తెలిపింది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోసం దాదాపు నాలుగేళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు నిర్వహించి, ధ్రువీకరించిన సమాచారంతో కథ, స్క్రీన్‌ప్లే సిద్ధం చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను అధికారికంగా త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో మీనా కుమారి బయోపిక్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!