

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ట్రైలర్‌ను చిత్రబృందం లాంచ్ చేసింది. విడుదలైన వెంటనే ఈ గ్లింప్స్ నెట్లో వైరల్ అవుతోంది.
ట్రైలర్లో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు—ఒకటి సాధారణ వ్యక్తి, మరొకటి రోమాంచితమైన అఘోర రూపం. మంచు కొండల్లో తెరకెక్కించిన భారీ యాక్షన్ సన్నివేశాలు, ఆయన పవర్ఫుల్ డైలాగులు అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.
“ఇప్పటి వరకూ మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్… మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్!” అనే డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది.
సనాతన ధర్మం నేపథ్యంగా కథ నడుస్తుందనే సంకేతాలు ట్రైలర్ మొత్తం కనిపిస్తున్నాయి. ఈసారి విజువల్స్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై బృందం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ది తాండవం, జాజికాయ పాటలు మంచి స్పందన పొందాయి.
డిసెంబర్ 5న చిత్రం భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ను చూసిన ఫ్యాన్స్ బాలయ్య మళ్లీ ఒకసారి విశ్వరూపం చూపించాడని అంటున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!