

అక్కినేని అఖిల్ చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, ఆయన తొలి చిత్రం ‘అఖిల్’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు. అలాంటి సమయంలో కొంత విరామం తీసుకుని నటించిన ‘లెనిన్’ చిత్రం జూలై 10న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి ఇప్పటికే గణనీయమైన లాభాలను అందుకుంది.
ఇటీవల కాలంలో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ₹100 కోట్ల గ్రాస్ మైలురాయి కీలక ప్రమాణంగా మారింది. దీంతో ‘లెనిన్’తో అఖిల్ కూడా ఈ క్లబ్‌లో చేరతాడని అభిమానులు ఆశించారు. నిర్మాత నాగ వంశీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం వచ్చిన వసూళ్ల ప్రకారం ఈ మైలురాయి అందుకోవడం కష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹38.31 కోట్ల షేర్, ₹71.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ₹22 కోట్ల బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ₹16.31 కోట్ల లాభాలను అందుకున్నప్పటికీ, ₹100 కోట్ల మార్క్ ఇంకా దూరంగానే ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!