

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. ఏకంగా 21 పర్యవేక్షణ కేంద్రాల్లో గాలి నాణ్యత సూచీ (AQI) 400 పాయింట్ల మార్కును దాటినట్లు సమాచారం. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు, దుమ్ము కారణంగా రహదారులపై దృశ్యమానత తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ వాయు కాలుష్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద మొదటి, రెండో దశ చర్యలను అధికారులు అమలు చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల ఆరోగ్యంపై మరింత ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!