
బిజినెస్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమోక్రాట్ల విజయంపై ప్రశంసలు వ్యక్తం చేశారు. ప్రజలు విభజనకు దారితీసే రాజకీయాల కంటే అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లే రాజకీయాలను కోరుకుంటున్నారని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రజల అభిప్రాయానికి ఈ విజయం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
డెమోక్రాట్లు ఇక చురుకుగా రంగంలోకి దిగి తమ బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం వచ్చిందని ఒబామా పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చే రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన వ్యాఖ్యల ద్వారా సూచించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!