

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ ఫినాలేకు దగ్గరవుతోంది. డిసెంబర్ మధ్యలో ఫినాలే జరిగే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నప్పటికీ, షో నిర్వాహకులు ఇప్పటివరకు అధికారిక తేదీని ప్రకటించలేదు. మరోవైపు, హౌస్‌లో పోటీ తీవ్రం కావడంతో టాప్-2లో నిలిచే కంటెస్టెంట్లు ఎవరనే దానిపై ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు. గతంలో రోహిత్ టాప్-2లో ఉంటాడని భావించినప్పటికీ, ఆయన ఎలిమినేషన్‌తో ఆ అంచనాలు మారిపోయాయి.
ప్రస్తుతం త్రిగుణ్, ముకేశ్ టాప్-2 రేసులో ముందున్నారని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. టాస్కుల్లో ఇద్దరూ మంచి ప్రదర్శన కనబరుస్తుండటంతోపాటు, హౌస్ బయట కూడా బలమైన అభిమానగణాన్ని కలిగి ఉన్నారు. ఈ సీజన్ 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాగా, ప్రస్తుతం వర్షిణి, ముకేశ్, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, అమన్, దేబ్జానీ, శివకుమార్, సుధీర్, నరేశ్, నీతూ సహా 10 మంది హౌస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో ఫైనల్-2కు చేరేది ఎవరు? విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!