
బిజినెస్

ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు రావాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సవాల్‌పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. విదేశీ ప్రభావం సహా పలు రాజకీయ అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చ జరగాలని రాహుల్ పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై హిమంత వ్యంగ్యంగా స్పందించారు.
‘‘ప్రియమైన రాహుల్ జీ.. గులాబీలు ఇచ్చేది వాలెంటైన్స్ డే రోజునే కానీ, దీపావళికి కాదు. ఏదేమైనా పార్లమెంట్లో మిమ్మల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ బహిరంగ చర్చ సవాల్‌ను పక్కనపెట్టి, రాజకీయ పోరాటం పార్లమెంట్‌లోనే కొనసాగుతుందన్న సంకేతాలిచ్చారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!