
బిజినెస్

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి ప్రముఖ నటీనటులు భాగమైన ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా సహా పలు అంతర్జాతీయ ప్రాంతాల్లో షోలు ప్రారంభమైనట్లు సమాచారం. భారత్‌లో ఈ సినిమా రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు ముందే వివిధ మార్కెట్లలో ప్రీ సేల్స్ ద్వారా మంచి స్పందన అందుకున్నట్లు తెలుస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ‘రామాయణ’ ప్రీ సేల్స్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తొలి వారాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనాలు పెరిగాయి. అయితే, ప్రీ సేల్స్‌కు సంబంధించిన అధికారిక లెక్కలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!