

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ ఘన విజయం సాధించడంతో సీక్వెల్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో రజినీకాంత్‌తో పాటు ఎస్.జే. సూర్య, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరోసారి తనదైన శైలిలో హై ఎనర్జీ మాస్ మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడంతో తాజాగా మరో మ్యూజిక్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ‘జైలర్ 2’లోని మూడో పాట ‘రేవ్’తో పాటు పూర్తి సంగీత ఆల్బమ్‌ను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. ఈ సందర్భంగా అనిరుధ్ సంగీతపు సునామీ రాబోతోందంటూ ఆసక్తి పెంచారు. ఈ ప్రకటనతో రజినీకాంత్ అభిమానుల్లో సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!