

శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత ప్రధాన తారాగణంగా దర్శకుడు జీవీకే తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం “అమరావతికి ఆహ్వానం” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్, హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందం సినిమా కథ, మ్యూజిక్, టెక్నికల్ విలువలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు జీవీకే మాట్లాడుతూ ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాదని, రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేసే హారర్ థ్రిల్లర్ అని తెలిపారు. హీరో శివ కంఠంనేని, హీరోయిన్లు ఎస్తేర్, ధన్య, సుప్రిత తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చెప్పారు. చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!