

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ–2 తాండవం’ డిసెంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
వీకెండ్లకే పరిమితం కాకుండా, వారపు రోజులలో కూడా థియేటర్లలో ప్రేక్షకుల సందడి కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా టికెట్ బుకింగ్స్ పై మేకర్స్ అధికారికంగా స్పందించారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా టికెట్ బుకింగ్స్‌కు భారీ స్పందన లభించినట్లు వెల్లడించింది.
బుక్ మై షో, డిస్ట్రిక్ట్, పేటీఎం వంటి ప్రముఖ టికెట్ యాప్స్‌లో ఇప్పటివరకు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ గణాంకాలు చూస్తే, ‘అఖండ–2 తాండవం’ కు పాన్ ఇండియా స్థాయిలో మాస్ ప్రేక్షకుల నుంచి బలమైన స్పందన వచ్చిందని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు థమన్ సంగీతం అందించగా, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. మొత్తంగా బాలకృష్ణ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్‌ను ఈ సినిమా బలంగా ఆకట్టుకుంటోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!