
.webp&w=3840&q=75)
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 : తాండవం మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్స్, 12 న గ్రాండ్ రిలీజ్ ఉండగా, ఇటీవల విడుదల చేసిన "శివ శివ" అనే ఎమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముందుగా డిసెంబర్ 5 న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడటంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ ఇప్పుడు భారీగా టికెట్లు బుక్ చేస్తూ “జై బాలయ్య” అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
బ్లాక్బస్టర్ అఖండకు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ మళ్లీ డ్యూయల్ రోల్లో, ముఖ్యంగా అఘోర పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్గా నటించారు. అలాగే పూర్ణ, హర్షాలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించిన ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ప్లస్ నిర్మించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, అవధి సహా మొత్తం ఆరు భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!