
జనరల్

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీనివాస మంగాపురం' చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ఈ చిత్రంలో రషా తడాని కథానాయికగా నటించగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి మోహన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు లెజెండరీ నటుడని, ఎన్నో విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్న గొప్ప వ్యక్తి అయినప్పటికీ సెట్స్‌లో మాత్రం ఎంతో సింపుల్‌గా ఉండేవారని అజయ్ భూపతి అన్నారు. దర్శకుడు చెప్పిన ప్రతి సూచనను ఎలాంటి అభ్యంతరం లేకుండా పాటించారని, షూటింగ్‌కు ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదని చెప్పారు. ఈ సినిమా విషయంలో "ఐ లవ్ యూ" చెప్పాల్సి వస్తే హీరో జయకృష్ణ ఘట్టమనేని, మోహన్ బాబు ఇద్దరికే చెబుతానని, తమకు వారు ఎంతో అండగా నిలిచారని వెల్లడించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!