

రామ్ పోతినేని హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘లోన్ వుల్ఫ్’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రామ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై కొంతకాలంగా చర్చ జరుగుతుండగా.. సంయుక్త మీనన్ పేరు ప్రముఖంగా వినిపించింది.

తాజాగా ఆ వార్తలకు మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం.. ఆమెను తమ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా ఖరారైనట్లు స్పష్టమైంది. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు. రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!