

అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రదాడుల బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులు అర్పిస్తూ.. ఉగ్రవాదంపై పోరులో భారత్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన నిబద్ధతను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజంతో కలిసి ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.
2014లో అమెరికా పర్యటన సందర్భంగా తాను 9/11 మెమోరియల్, మ్యూజియాన్ని సందర్శించిన సందర్భానికి సంబంధించిన చిత్రాలను ప్రధాని మోదీ పంచుకున్నారు. 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ వారికి గౌరవ నివాళులు అర్పించారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా కొనసాగుతోందని పేర్కొంటూ.. దానిపై అంతర్జాతీయ పోరాటానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!