
జనరల్

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో నటుడు అడివి శేష్ ప్రత్యేక గౌరవం అందుకోనున్నారు. భారతీయుల గర్వాన్ని ప్రపంచ వేదికపై చాటుతూ వరుసగా మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఆగస్టు 14న ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై భారత త్రివర్ణ పతాక రంగుల్లో వెలుగులు ప్రసరించేలా లైటింగ్ లివర్‌ను అడివి శేష్ ఆపరేట్ చేయనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆగస్టు 16న న్యూయార్క్‌లో నిర్వహించే ఇండియా డే పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!