

బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ ఆమె టీమ్ లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ఏఐ సంస్థపై న్యాయపరమైన చర్యలకు దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో తగిన న్యాయపరమైన పరిహారం కోసం చర్యలు తీసుకుంటున్నామని, నష్టపరిహారంగా రూ.7,000 కోట్ల మొత్తాన్ని అంచనా వేసినట్లు తెలిపింది. అనుమతి లేకుండా ఊర్వశి పేరు లేదా గుర్తింపును వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని సంస్థను హెచ్చరించింది.
ఈ ఆరోపణలపై బాలీవుడ్‌ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ షీరాజ్ హసన్ స్పందించారు. ఊర్వశి టీమ్ పేర్కొన్న రూ.7,000 కోట్ల క్లెయిమ్‌ను ఆయన కొట్టిపారేశారు. గతంలో ఊర్వశితో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్, ఏఐ భవిష్యత్తుపై చర్చించిన అంశాలను ప్రస్తావిస్తూ.. వినోద రంగంలో ఏఐ సినిమాలు, డిజిటల్ స్టార్లు వంటి కొత్త విధానాలు రాబోతున్నాయని అన్నారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తును అర్థం చేసుకోవాలని ఊర్వశికి సూచించారు. ఈ వివాదం ప్రస్తుతం ప్రముఖుల గుర్తింపు హక్కులు, ఏఐ వినియోగంపై సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!