

టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి అమలా పాల్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను చూపించే విధానంపై తాజాగా స్పందించారు. కొన్ని సినిమాల్లో మహిళలను సరిగ్గా చూపించడం లేదనే విమర్శలపై ఆమె మాట్లాడుతూ.. ఇందుకు మొత్తం చిత్ర పరిశ్రమను నిందించడం సరికాదన్నారు. ఒక సినిమాలో మహిళలను చూపించే విధానం ఆ సినిమా దర్శకుడు లేదా చిత్రబృందం ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించవచ్చని పేర్కొన్నారు. అయితే కాలంతో పాటు మార్పు వస్తోందని, ప్రస్తుతం మహిళా ప్రాధాన్య చిత్రాలు కూడా ఎక్కువగా తెరకెక్కుతున్నాయని చెప్పారు.
తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 15 ఏళ్లకు పైగా అయిందని, మహిళలు తమకు తగిన స్థానం, అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అమలా పాల్ తెలిపారు. తన కెరీర్‌లోనూ మూస పద్ధతి పాత్రలకు పరిమితం కాకుండా కొత్తదనం ఉన్న కథలను ఎంచుకున్నానని చెప్పారు. అందులో భాగంగానే 2019లో ‘ఆడై’ వంటి బోల్డ్ పాత్రతో కూడిన సాహసోపేతమైన సినిమా చేశానని గుర్తుచేశారు. ఆ సమయంలో తన ఇమేజ్‌పై ప్రభావం పడుతుందేమోననే భయం ఉన్నప్పటికీ, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదిగా అనిపిస్తోందన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం మళ్లీ అలాంటి పాత్ర చేయలేనని నిజాయితీగా చెప్పుకొచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!