

హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చకోర – లూనార్ బర్డ్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 9న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు నిర్మాత, దర్శకులను అభినందిస్తూ, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు.
ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా నిడివి 2 గంటల 17 నిమిషాల 58 సెకన్లు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ‘చకోర’ విడుదల కానుంది. టి-సిరీస్ మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. శ్రవణ్, మలైకా టి. వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్.బి. శ్రీరామ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!