
న్యూస్

నటి శ్రీలీల వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్‌గా పట్టా అందుకున్నారు. ముంబయిలో జరిగిన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆమె పట్టా స్వీకరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నటనతో పాటు చదువును సమతూకంగా కొనసాగించిన ఆమెకు అభిమానులు “డాక్టర్ శ్రీలీల” అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చిన్ననాట అమ్మమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు తాను ఏమీ చేయలేకపోయానని, అప్పుడే వైద్యురాలిగా మారాలని నిర్ణయించుకున్నానని శ్రీలీల గతంలో వెల్లడించారు. కన్నడ చిత్రం ‘కిస్’ ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె, ప్రస్తుతం అగ్రతారల సరసన అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల ‘పరాశక్తి’లో నటించిన ఆమె, పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కనిపించనున్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!