

ఈటీవీ విన్లో సాధారణ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రారంభమై ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్‌సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ ఇప్పుడు మరో మెట్టు ఎక్కుతోంది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో, మేఘ లేఖ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన సీజన్–2 మరింత ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లతో మెప్పించగా, ఇప్పుడు వాటన్నిటికీ మించి థ్రిల్ పంచేందుకు ‘కానిస్టేబుల్ కనకం: కాల్ ఘాట్ – చాప్టర్ 3’ పేరుతో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశేషం ఏమిటంటే, ఈసారి ఇది ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని భారీగా పెంచింది. “అడుగడుగునా రహస్యాలు దాగి ఉన్న కాల్ ఘాట్” అనే డైలాగ్‌తో పాటు, నరరూప రాక్షసుల నేపథ్యాన్ని చూపిస్తూ వచ్చిన విజువల్స్ సినిమాకు హై లెవల్ సస్పెన్స్‌ను జోడిస్తున్నాయి. వెబ్‌సిరీస్ కంటే భారీ హంగులు, బలమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ స్పష్టంగా సూచిస్తోంది. ఈసారి కానిస్టేబుల్ కనకం ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంటుంది? అన్నది పెద్ద తెరపై చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!