

చిన్ననాటి జ్ఞాపకాలు, గ్రామీణ వాతావరణం, స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు కుటుంబ కథా చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. శ్రీకర్ నయన్ జి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా మేకర్స్ మరో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు.
‘కొన్ని స్నేహాలు అమాయకత్వంతో మొదలై జ్ఞాపకాలుగా మారతాయి’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘ఫ్రెండ్‌షిప్ సాంగ్’ను ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి ఆనంద్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా గోదావరి ప్రాంతంలోని పచ్చని పల్లె వాతావరణంలో సాగుతుంది. సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లే ఓ పట్టణ కుర్రాడికి పేపర్ బాయ్‌తో ఏర్పడే స్నేహం, వారి బాల్యపు అల్లర్లు, ఆటపాటలు, మధుర జ్ఞాపకాల చుట్టూ కథ నడుస్తుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!