

రాత్రివేళ ఎక్కువ కారం ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా సరిగా నిద్ర పట్టక, క్రమంగా నిద్రలేమి సమస్యలు తలెత్తి మరుసటి రోజు అలసట, నీరసం కలుగుతుంది.
అత్యధికంగా కారం తీసుకోవడం వల్ల కడుపు పొరలు దెబ్బతిని యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి కడుపునొప్పి, వికారం, విరేచనాలకు దారితీస్తుంది. అలాగే రుచి మొగ్గల సున్నితత్వం తగ్గి సాధారణ ఆహారం రుచిగా అనిపించకపోవచ్చు. శరీరంలో వేడి పెరిగి మొటిమలు, చర్మ సమస్యలు రావచ్చు. కారం పూర్తిగా మానాల్సిన అవసరం లేదు, కానీ పరిమితంగా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ, తాజా కూరగాయలు ఆహారంలో చేర్చుకోవడం మంచిది. సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!