

స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్‌ను బలపరుచుకున్న ఆయన, ఇదే ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సూర్య కెరీర్‌లో 47వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత సూర్య పూర్తిస్థాయి పోలీస్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పటికే ఉంది. తాజాగా ఈ చిత్ర కథకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో సూర్య ఓ చూపులేని పోలీస్ అధికారిగా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఓ కేసును దర్యాప్తు చేసే సమయంలో చూపు కోల్పోయిన ఆయన, కొన్నేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ఓ మిస్టరీ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతారట. ఈ దర్యాప్తులో నజ్రియా ఫహద్, ప్రేమలు నటుడు నెస్లేన్ కూడా కీలకంగా భాగమవుతారని తెలుస్తోంది. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య కొత్తేమీ కాకపోవడంతో ఈ కథపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ప్రచారంలో ఉన్న కథ నిజమా కాదా అనేది సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!