

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత యష్ నుంచి సినిమా వస్తుండటంతో అభిమానుల్లో మొదటి నుంచే ఆసక్తి కనిపిస్తోంది. పాన్ వరల్డ్ స్థాయిలో చిత్రాన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ చెబుతుండగా, ఆ ప్రభావం ఆన్‌లైన్‌లోనూ కనిపిస్తోంది.
ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక బుక్‌మైషోలో ‘టాక్సిక్’ 1 మిలియన్ ఇంట్రెస్ట్‌లను నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం భారతీయ సినిమాల్లో అరుదైన రికార్డు సాధించిన జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆన్‌లైన్ ఆసక్తికి, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు కొంత వ్యత్యాసం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో గతంలో ఉన్నంత ఉత్సాహం ప్రస్తుతం కనిపించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనాలను ‘టాక్సిక్’ ఎంతవరకు అందుకుంటుందో విడుదల తర్వాతే స్పష్టమవుతుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!