
జనరల్

సీనియర్ హీరోయిన్ త్రిష వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. ‘బృందా’ తర్వాత ఆమె మరోసారి తెలుగు వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు త్రిష ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ సిరీస్‌ను సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
‘మా ఇంటి బంగారం’తో విజయాన్ని అందుకున్న నందినీ రెడ్డి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!