

దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తుంటాడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా మరో కొత్త గుర్తింపును సంపాదించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబును కూడా పూర్తిగా కొత్తగా చూపించేందుకు రాజమౌళి ఎంతో కష్టపడుతున్నాడని తెలుస్తోంది. మేకర్స్ అయితే ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే సినిమా ఎంత స్థాయిలో నిలుస్తుందో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
రాజమౌళి తన సినిమా సెట్స్‌లో ఉండగానే తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడో ముందుగానే స్పష్టత ఇస్తుంటాడు. ‘RRR’ సినిమా సమయంలోనే తన తర్వాతి సినిమా మహేష్ బాబుతోనే అని ప్రకటించాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో, ప్రస్తుత సినిమా షూటింగ్ జరుగుతుండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కథను ఇప్పటికే ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం. రాజమౌళి – అల్లు అర్జున్ కాంబినేషన్ ఇప్పటివరకు రాలేదు కాబట్టి, ఈ జోడీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!