

టాలీవుడ్లో చాలా కాలంగా వినిపిస్తున్న పెళ్లి వార్తలు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక మందన్నా ఈ నెల 26 న పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ నెల 24, 25 తేదీల్లో సంగీత్, హల్దీ వేడుకలు నిర్వహించి, 26 న సంప్రదాయంగా వివాహం చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.
ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్‌గా నిర్వహించాలని ఈ జంట నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అతిథులకు ‘నో ఫోన్ పాలసీ’ అమలు చేయనున్నారట. ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టంగా చెప్పారట. పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు లీక్ కాకుండా ఉండటమే ఈ నిర్ణయం వెనుక కారణమని సమాచారం. అంతేకాదు, గిఫ్టులు కూడా తీసుకురావద్దని, “మీ రాకే మాకు పెద్ద గిఫ్ట్” అని చేతిరాత లేఖల ద్వారా కోరినట్టు తెలుస్తోంది.
ఇతర స్టార్ వెడ్డింగ్స్‌కు భిన్నంగా, ఈ వేడుకకు సినీ ప్రముఖులను ఆహ్వానించడం లేదట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే పెళ్లి జరగనుందని సమాచారం. అయితే వచ్చే నెల 4 న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి, అప్పుడే ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించే ప్లాన్ ఉన్నట్టు టాక్. పెళ్లి తర్వాత నెలరోజులు షూటింగ్‌లకు విరామం తీసుకుని, విదేశాలకు హనీమూన్‌కు వెళ్లాలని కూడా భావిస్తున్నారట. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!