

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్ గ్లింప్స్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.
ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందన్న వార్తలపై రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. కథ పెద్దదైనా చివరకు ఒకే భాగంగా తెరకెక్కించాలని నిర్ణయించామని, సినిమా రన్‌టైమ్ మూడు గంటలకుపైగా ఉంటుందని తెలిపారు. అలాగే దాదాపు 25 నిమిషాల పాటు పురాణ నేపథ్యంతో సాగే కీలక సన్నివేశాలు ఉంటాయని, రామాయణం నుంచి ప్రేరణ పొందిన కొన్ని ఘట్టాలు కనిపిస్తాయని చెప్పారు. భారతీయ భావోద్వేగాలతో పాటు ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించామని తెలిపారు.
ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ‘వారణాసి’ సినిమా దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. కేవలం ప్రమోషన్లకే రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది (2027) ఏప్రిల్ 7 న ఉగాది కానుకగా ఐమాక్స్ ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజా ప్రచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రూ.650 నుంచి 700 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. అయితే మేకర్స్ మాత్రం రూ.1000 కోట్ల వరకు ఆశిస్తున్నారని టాక్. రాజమౌళి థియేటర్లలో సినిమా రన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, కనీసం ఎనిమిది వారాలు పూర్తయ్యాకే ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!