

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగుపెట్టే స్థాయిలో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తన నుంచి ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ ఎంట్రీ రేంజ్ సినిమాగా "వారణాసి"తో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించి హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఇప్పటివరకు ‘వారణాసి’ గ్లింప్స్ పెద్దగా థియేటర్లలో కనిపించడం లేదు. కొన్ని పరిమిత స్క్రీన్స్‌లో మాత్రమే వ్యక్తిగతంగా గ్లింప్స్ ప్లే అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో మాత్రం ఇంకా ఈ గ్లింప్స్ రాలేదు. కానీ ఇప్పుడు మహేష్ అభిమానులకు ‘మురారి’ రూపంలో ప్రత్యేకమైన ట్రీట్ రాబోతోందనే వార్త వినిపిస్తోంది.
డిసెంబర్ 31 న ‘మురారి’ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సినిమా స్క్రీన్స్‌లో ‘వారణాసి’ గ్లింప్స్ ను ప్లే చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆ గ్లింప్స్‌కు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. అంటే ‘మురారి’ ప్రింట్స్‌తో పాటు ‘వారణాసి’ గ్లింప్స్ అటాచ్ అయి థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఇది నిజమైతే మహేష్ బాబు అభిమానులకు ఇది పెద్ద పండుగ లాంటి విషయం అని చెప్పొచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!