

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'డ్రాగన్'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వైరల్ అవుతోంది. చేతికి గాయం కావడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ నిలిపివేయకుండా, తారక్ అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2వ వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇతర నటీనటుల కలయికలో కీలక సన్నివేశాలతో పాటు టాకీ భాగాలను కూడా ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక 'డ్రాగన్'లో ప్రశాంత్ నీల్ తన సాధారణ శైలికి భిన్నంగా కనిపించనున్నారనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన విభిన్నమైన రంగుల సమ్మేళనంతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా నీల్ చిత్రాల్లో కనిపించే డార్క్ టోన్స్, బ్లాక్ అండ్ గ్రే ఛాయలకు భిన్నంగా ఈ భాగాలను రంగురంగుల దృశ్యాలతో, అత్యంత వైభవంగా చూపించనున్నారట. ఫ్లాష్‌బ్యాక్‌లో రిచ్ విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని ఇండస్ట్రీ వర్గాల మాట. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కొనసాగుతుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!