
జనరల్

భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్‌కు సంబంధించిన నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లి, హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆయన నివాసాల్లో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితో జయరాజ్ సంబంధాలు కొనసాగిస్తూ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు సూర్యాపేట, తాండూరు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలు, ఇతర వివరాలపై అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!