

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల టైటిల్‌ను ప్రకటించిన చిత్రబృందం, వెంటనే గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది. చిరంజీవి కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో థియేట్రికల్ హక్కుల వ్యాపారం కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ‘కాకా’ నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నైజాం ప్రాంతంలో దిల్ రాజుకు ఉన్న బలమైన పంపిణీ వ్యవస్థతో సినిమాకు మంచి థియేటర్లు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి బరిలో పలు చిత్రాలు ఉండటంతో థియేటర్ల కేటాయింపు కీలకంగా మారనుంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్ చిరంజీవికి కుమార్తెగా కనిపించనుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!