

లోకేష్ కనగరాజ్ పేరు వినగానే అభిమానులకు ఎల్‌సీయూ గుర్తుకు వస్తుంది. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వంటి ప్రాజెక్టుల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీటిని తాత్కాలికంగా పక్కన పెట్టి అల్లు అర్జున్‌తో AA23 చిత్రాన్ని ముందుగా తెరకెక్కించడానికి మైత్రీ మూవీ మేకర్స్‌తో ఉన్న పాత కమిట్‌మెంట్ ప్రధాన కారణమని సమాచారం. దాదాపు ఆరేళ్ల క్రితమే ఈ సంస్థ లోకేష్‌కు అడ్వాన్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనే కోరిక తనకు చాలాకాలంగా ఉందని లోకేష్ గతంలో వెల్లడించాడు.
ఈ రెండు కారణాలు కలవడంతో AA23 ముందుగా పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. ఖైదీ 2 ఆలస్యానికి కార్తి ఇతర సినిమాల షెడ్యూల్స్ కూడా కారణమయ్యాయని సమాచారం. రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ముందుకు సాగకపోవడంతో లోకేష్‌కు లభించిన ఖాళీ సమయంలో AA23పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అడవి, గుర్రం, జంతువుల నేపథ్యాన్ని సూచించేలా విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో ఆసక్తిని పెంచింది. అల్లు అర్జున్ సినిమా తర్వాత ఖైదీ 2ను తెరకెక్కిస్తానని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!