

దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో నార్త్ జోన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి వెస్ట్ జోన్‌పై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నార్త్ జోన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 302 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ నాలుగో రోజు ఆట ఆరంభానికి 220/7తో ఉండగా.. మిగిలిన మూడు వికెట్లను గంటలోపే కోల్పోయింది. అబిద్ ముస్తాక్ 4/60తో చెలరేగడంతో వెస్ట్ జోన్ 234 పరుగులకు ఆలౌటైంది. తనుష్ కొటియన్ డకౌట్ కాగా, తుషార్ దేశ్‌పాండే 5 పరుగులకే వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోరుకు 8 పరుగులు జోడించిన ఉర్విల్ పటేల్ చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
మ్యాచ్‌లో మూడో రోజు వెస్ట్ జోన్ 195/3తో పటిష్ఠ స్థితిలో ఉన్న సమయంలో ముషీర్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ వికెట్లు కోల్పోవడం కీలక మలుపుగా మారింది. అబిద్ ముస్తాక్ మ్యాచ్‌లో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 251 పరుగులు చేయగా, వెస్ట్ జోన్ 187 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 222 పరుగులు చేసింది. దీంతో వెస్ట్ జోన్ ముందు 302 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. సెమీఫైనల్లో నార్త్ జోన్ సౌత్ జోన్‌తో తలపడనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!