

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, సురభిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ కూడా షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్, ప్రకాశ్ రాజ్, ఉత్తేజ్, రచ్చ రవిలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
‘ఎల్లమ్మ’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పలు ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో విజయాలు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి హీరోగా ఎలాంటి నటనను కనబరుస్తారనే ఆసక్తి నెలకొంది. నటుడిగా ఆయనకు ఈ సినిమా ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!