

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హర్యానాలోని ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖి సంభాషించడంతో పాటు ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్’ ఇవ్వాలని యూనివర్సిటీ ఆహ్వానించింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026లో కేటీఆర్‌కు అనుకూలమైన తేదీన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూనివర్సిటీ తెలిపింది.
ఈ సందర్భంగా యూనివర్సిటీలోని రాజ్యాంగ మ్యూజియం, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీని సందర్శించాలని కూడా కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. విద్యార్థులతో సంభాషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. 2009లో స్థాపించిన జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీని భారత ప్రభుత్వం 2020లో ‘ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’గా గుర్తించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!