

కన్నడ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేశారు. తెలుగు థియేట్రికల్ హక్కులను రూ.100 కోట్లకు పైగా కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో, దిల్ రాజుకు భారీ నష్టం తప్పదనే అంచనాలు వెలువడ్డాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజు టాక్సిక్ హక్కులను రిటర్నబుల్ అడ్వాన్స్ విధానంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే 45 రోజుల్లో అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు పంపిణీదారులతోనూ ఇదే తరహా నిబంధనలతో ఒప్పందాలు జరిగాయని సమాచారం. దీంతో సినిమా నష్టభారం దిల్ రాజుపై కాకుండా నిర్మాతలు, యష్‌పై పడే అవకాశం ఉందని తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!