

స్టార్ దర్శకుడు శంకర్ ఇటీవల వరుస పరాజయాలతో కొంత ఒత్తిడిలో ఉన్నారు. మళ్లీ బాక్సాఫీస్ వద్ద బలమైన విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నటుడు ధనుష్‌తో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల చెన్నైలో జరిగిన ధనుష్ 55 వ సినిమా ప్రారంభోత్సవానికి శంకర్ హాజరుకావడం ఈ టాక్‌కు మరింత బలం ఇచ్చింది. ధనుష్ సినిమా నిర్మిస్తున్న ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థే ‘వేల్పారి’ నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సాన్నిహిత్యం వల్ల ధనుష్ ఈ ప్రాజెక్ట్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ప్రారంభ దశలో కొనసాగుతున్నాయి. దర్శకుడు శంకర్ వినిపించే కథనం, నటుడు ధనుష్ అందుబాటులో ఉన్న తేదీలు ఈ కాంబినేషన్‌ను నిర్ణయించే కీలక అంశాలుగా భావిస్తున్నారు. ఒకవేళ ఈ కలయిక కార్యరూపం దాల్చితే, ఇండియన్ సినిమాలో ఇది ఒక ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!