

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. సమంత తల్లి కాబోతున్నారనే వార్తలు గత రెండు రోజులుగా వైరల్ అవుతున్నాయి. దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న సమంతకు సంబంధించిన కొన్ని చిత్రాలు, దృశ్యాల ఆధారంగా ఈ ప్రచారం మొదలైంది.
అయితే ఈ వార్తలపై సమంత గానీ, ఆమె సన్నిహితులు గానీ, చిత్ర బృందం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ ప్రచారం నిజమా కాదా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్ల స్థూల వసూళ్లు సాధించి సమంత కెరీర్లో అత్యుత్తమ ప్రారంభాల్లో ఒకటిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!