

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న సమాచారం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రీకరణకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కీలకమైన భాగం కోసం ఎన్టీఆర్‌పై ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో క్లైమాక్స్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
ఈ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఓ పాటను కూడా చిత్రీకరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే నలుపు, బూడిద రంగుల ఛాయలకు భిన్నంగా ఈ చిత్రంలోని గతానికి సంబంధించిన సన్నివేశాలు పూర్తి రంగులతో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ అంశం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ప్రత్యేకమైన కథనంతో డ్రాగన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!