

మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతూ మాధవన్ త్వరలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈసారి ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విభిన్నమైన కథలు, ప్రత్యేకమైన కథనాలతో గుర్తింపు సంపాదించుకున్న జీతూ మాధవన్.. లేటెస్ట్ గా సూర్యతో తీసిన సీన్ సినిమాతో ముందుకు వచ్చి హిట్ కొట్టాడు.ఇప్పుడు దుల్కర్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ ఈ కలయికపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, మమితా బైజు జంటగా కనిపించనున్నారనే ప్రచారం ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు జీతూ మాధవన్ గతంలో తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. ఇప్పుడు ఆయన దుల్కర్‌తో ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ముగ్గురి కలయిక నిజమైతే సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వినిపిస్తున్నవన్నీ ప్రచార వార్తలే. చిత్ర యూనిట్ నుంచి అధికారిక సమాచారం వస్తేనే ఈ సినిమా గురించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!