

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్లో భారీ ఉత్సాహం నెలకొంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు వర్కింగ్ టైటిల్ RC17గా పిలుస్తున్న కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇది రెండు భాగాలుగా రూపొందే భారీ యాక్షన్ డ్రామా అని సమాచారం. గ్రామీణ నేపథ్యం, ఇంటెన్స్ యాక్షన్, బలమైన భావోద్వేగాలతో ఈ సినిమా రంగస్థలంను మించిపోయేలా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
పెద్ది పూర్తయ్యాక RC17 పై పూర్తి దృష్టి పెట్టనున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదే హాట్ టాపిక్. సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్, సమంత పేర్లతో పాటు పుష్ప సిరీస్‌తో సుకుమార్ దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది నిజమైతే, రష్మికకు సుకుమార్‌తో మూడో సినిమా, రామ్ చరణ్‌తో తొలి జోడీ అవుతుంది. మరోవైపు జాన్వీ కపూర్ పేరు కూడా పరిశీలనలో ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఇదిలా ఉండగా, చరణ్ ప్రస్తుతం రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దితో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరీ చికిరీ’ పాట యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో సెన్సేషన్ సృష్టించింది. ఈ నెల (ఫిబ్రవరి) 14 లేదా 15 న రెండో పాట విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చరణ్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగా విడుదలను వాయిదా వేసి, ఈ ఏడాది(2026) ఏప్రిల్ 30 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!