
జనరల్

‘ఇరుముడి’ బాక్సాఫీస్ విజయంతో రవితేజ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం తన సాధారణ రెమ్యునరేషన్‌లో కేవలం మూడో వంతు మాత్రమే తీసుకున్న మాస్ మహారాజా దానికి బదులుగా కీలకమైన నైజాం ప్రాంత థియేట్రికల్ రైట్స్‌ను తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన తీసుకున్న డీల్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ‘ఇరుముడి’కి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ఈ డీల్ రవితేజకు భారీగా కలిసొచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ డీల్ ద్వారా ఆయన మొత్తం ఆదాయం సుమారు రూ.30 కోట్ల వరకు చేరుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రవితేజ వేసిన ఈ లెక్క మంచి ఆర్థిక నిర్ణయంగా మారే అవకాశముంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!