

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సగటున 70 శాతం పెర్ఫార్మెన్స్ బోనస్ ప్రకటించినట్లు సమాచారం. గత త్రైమాసికంతో పోలిస్తే బోనస్ శాతంలో మార్పు లేకపోయినా, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 10 శాతం తగ్గింది. ఉద్యోగుల పనితీరు, జాబ్ లెవెల్ ఆధారంగా బోనస్ 65 నుంచి 80 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జేఎల్ 4, జేఎల్ 5 స్థాయి ఉద్యోగుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి 80 శాతం వరకు బోనస్ లభించినట్లు సమాచారం.
ప్రస్తుతం సాంకేతిక రంగం ఆర్థిక అనిశ్చితులు, కంపెనీల ఐటీ వ్యయాల మందగమనం, కృత్రిమ మేధస్సు రంగంలో వేగవంతమైన మార్పులు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఇన్ఫోసిస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.7,769 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. జేఎల్ 4, 5, 6 స్థాయి ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించి బోనస్ అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగులు వేతన పెంపుపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. జేఎల్ 4, 5 ఉద్యోగులకు త్వరలో, జేఎల్ 6, అంతకంటే పైస్థాయి ఉద్యోగులకు 2027 జనవరిలో వేతన సవరణ ఉండే అవకాశం ఉందని సమాచారం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!