

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం లోకాయుక్త రిజిస్ట్రార్ జస్టిస్ మల్లిఖార్జునరావును ఏపీ లోకాయుక్తగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన నియామక వారెంట్‌ను చదివి వినిపించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు జస్టిస్ మల్లిఖార్జునరావును అభినందించి పుష్పగుచ్ఛాలు అందించారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరతో పాటు న్యాయశాఖ, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!