
జనరల్

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా విడుదలపై క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా ముగించాలనే లక్ష్యంతో చిత్రబృందం పని చేస్తోంది. ఇటీవల వరుసగా ఆశించిన విజయాలు రాని రవితేజ, ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!