

ప్రభాస్ నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం "ది రాజా సాబ్" చుట్టూ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పుడు మేకర్స్ మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని పబ్లిసిటీ స్ట్రాటజీని కాస్త ట్యూన్ చేస్తున్నారట. డైరెక్టర్ మారుతి, తన టీమ్ కలిసి రాజమౌళి మార్కెటింగ్ ఎక్సపర్ట్స్ సలహాలతో ప్రమోషన్స్ లో కొత్త పంథా ఎంచుకున్నారని సమాచారం. ముందుగానే హైప్ క్రియేట్ చేయడం కాకుండా, ఈ సారి పాన్ ఇండియా లెవల్లో స్ట్రక్చర్డ్ క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ తర్వాత, ఇక నెక్స్ట్ స్టేజ్ ఆడియో ప్రమోషన్స్‌తో మొదలవుతుంది. ఇప్పటికే పాటలు కంప్లీట్ అయ్యి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయట.
మొదటి సింగిల్ ఈ నెల మూడవ వారంలో రిలీజ్ అవుతుందని, దాని తర్వాత ప్రతి పది రోజులకు ఒక్క కొత్త సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారట. న్యూ ఇయర్‌కి గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఉండబోతోంది. అంతేకాదు, క్రిస్మస్ స్పెషల్ ఈవెంట్‌ను యూఎస్ఏలో ప్లాన్ చేశారు ప్రభాస్‌కు ఉన్న అంతర్జాతీయ ఫ్యాన్ బేస్‌ని ఉపయోగించుకోవడానికే ఇది అంటున్నారు.
ఇవన్నీ చూస్తుంటే, “ది రాజా సాబ్” టీమ్ ఈసారి కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా, హిందీ బెల్ట్ మరియు ఓవర్సీస్ మార్కెట్లను కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పొచ్చు. మేకర్స్ నమ్మకం ప్రకారం, ఈ బాలీవుడ్ ఇన్‌క్లూసివ్ మార్కెటింగ్ ప్లాన్ వల్ల సినిమా రిలీజ్‌కి ముందే పాన్ ఇండియా లెవల్లో పెద్ద హైప్ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు.











కామెంట్స్ (3)
Excited for Raja Saab!
“Massive!”
Smart marketing move