

మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో మలయాళ సినీ పరిశ్రమలో అరుదైన తండ్రీకొడుకుల పోటీకి తెరలేవనుంది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ధనుష్ ‘ఓం: చాప్టర్ 1 ఉదిరం’, దుల్కర్ సల్మాన్ సోలో హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రెండు సినిమాలకు వేర్వేరు ప్రాంతాల్లో మార్కెట్ కీలకంగా మారనుంది. మమ్ముట్టి, ధనుష్‌లకు మంచి ఆదరణ ఉన్న కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ‘ఓం’కు భారీ ఓపెనింగ్స్‌పై అంచనాలు ఉన్నాయి. మరోవైపు ‘ఆకాశంలో ఒక తార’కు తెలుగు రాష్ట్రాల వసూళ్లు అత్యంత కీలకం కానున్నాయి.
ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న దుల్కర్ సల్మాన్‌కు ‘ఆకాశంలో ఒక తార’ మరో ముఖ్యమైన పరీక్షగా మారింది. ఈ సినిమాతో తన మార్కెట్‌ను మరింత బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ఓం: చాప్టర్ 1 ఉదిరం’కు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నవంబర్ 20న రెండు చిత్రాలు నిజంగానే పోటీపడితే, కేవలం సినిమాల మధ్యనే కాకుండా మమ్ముట్టి అనుభవానికి, దుల్కర్ సల్మాన్ పునరాగమన ప్రయత్నానికి మధ్య పోటీగా ఇది మారనుంది. తండ్రీకొడుకులు వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్‌ను పలకరించనుండటంతో అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ఏ సినిమా ప్రేక్షకుల ఆదరణను అందుకుంటుందో, ఏ చిత్రం వసూళ్లలో పైచేయి సాధిస్తుందో చూడాలి. ఈ క్లాష్‌పై పరిశ్రమ వర్గాల్లోనూ ఇప్పటికే చర్చ మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!