

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ పూర్తయింది. అయితే మిగిలిన చిత్రీకరణను వచ్చే ఏడాదిలోనే తిరిగి ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ‘సలార్ 2’ మిగిలిన షూటింగ్ 2027లో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ రెండు భాగాల పనులను ముందుగా పూర్తి చేస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ‘సలార్ 2’లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబళే ఫిల్మ్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిగిలిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!